ఎల్‌జీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌
ఎల్‌జీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ 5.7 అంగుళాల తాకే తెరతో జీ6 మొబైల్‌ను విడుదల చేసింది. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2017 సందర్భంగా బార్సిలోనాలో జరిగిన కార్యక్రమంలో జీ6ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ అధ్యక్షుడు జునో చో మాట్లాడుతూ.. నేటి స్మార్ట్‌ఫోన్ల యుద్ధంలో ప్రత్యేకతల కన్నా వినియోగంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎల్‌జీ యూఎక్స్‌ 6.0తో విడుదల చేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇది.

ఎల్‌జీ జీ6 ప్రత్యేకతలు 
* 5.7 అంగుళాల తాకే తెర 
* 4జీ ర్యామ్‌ 
* 32జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం 
* 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమేరా 
* 5 మెగాపిక్సెల్‌ ముందు కెమేరా 
* ఆండ్రాయిడ్‌ 7.0 నూగట్‌ 
* 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Posted On 26th February 2017

Source eenadu