అరిటాకు ఫిష్‌
అరిటాకు ఫిష్‌

కావలసినవి: చేపలు రెండు, కొద్దిగా నిమ్మరసం, కొబ్బరి తురుము రెండు టీస్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి నాలుగు, కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి నాలుగు రెబ్బలు, ఒకటీస్పూను జీలకర్ర, చిన్న అరిటాకులు రెండు.

 
తయారీ:  చేపలను కొంచెం పెద్దముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వాటిపై నిమ్మరసం, ఉప్పు చల్లి పావుగంటసేపు నాననివ్వాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్టు చేసుకోవాలి. ఒక్కో చేప ముక్కను ఒక్కో అరిటాకులో పెట్టి మసాలా పేస్టును ముక్కలకు రెండుపక్కలా పట్టించాలి. అరిటాకులను మడిచి ఊడిపోకుండా దారంతో కట్టాలి. వాటిని ఆవిరిలో ఏడు నిమిషాలపాటు ఉడికిస్తే నోరూరించే అరిటాకు ఫిష్‌ రెడీ అయిపోతుంది.

Posted On 26th February 2017

Source andhrajyothi