చెట్టినాడ్ చికెన్ కర్రీ
చెట్టినాడ్ చికెన్ కర్రీ

కావలసిన పదార్థాలు 

చికెన్‌- అర కిలో, దాల్చిన చెక్క- రెండు అంగుళాల ముక్క, యాలకులు- రెండు, తరిగిన ఉల్లిపాయలు- రెండు, టమోటాలు- రెండు (మెత్తగా రుబ్బుకోవాలి), నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు- కొద్దిగా, సోంపు, జీలకర్ర- ఒక్కో టీ స్పూను చొప్పున, లవంగాలు- నాలుగు, మిరియాలు- ఒక టీ స్పూను, ఎండుమిర్చి- నాలుగు, కారం- ఒక టేబుల్‌ స్పూను, ధనియాలు- ఒక టీ స్పూను, పసుపు- అర టీ స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు టీ స్పూన్లు, ఉప్పు- తగినంత.

తయారీ విధానం
సోంపు, మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలను కలిపి వేగించి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక దాల్చిన చెక్క, యాలకులు, కరివేపాకు, లవంగాలు వేసి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 2 నిమిషాలు వేగించాలి. తర్వాత టమోటా గుజ్జు, అల్లం మసాలా ముద్ద కూడా వేసి మరో 5 నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత చికెన్‌ ముక్కలు, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని చిన్న మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి.

Posted On 4th March 2017

Source andhrajyothi