రోడ్డు ప్రమాదాలకు క్లౌడ్‌తో చెక్‌
రోడ్డు ప్రమాదాలకు క్లౌడ్‌తో చెక్‌

ఇప్పటివరకు క్లౌడ్‌ సర్వీసుల్లో ఫైళ్లు, ఫొటోల స్టోరేజీ మాత్రమే కుదురుతోంది.ఇకపై రోడ్డు ప్రమాదాల నివారణకూ ఈ సాంకేతికతను వినియోగిస్తారు. ప్రయోగ దశలో ఉన్న క్లౌడ్‌ కంట్రోల్‌ సాంకేతికతతో ఇది వీలవుతుంది. దీని కోసం వాహనాలు నడిపే వ్యక్తులందరూ క్లౌడ్‌ సర్వీసుకు అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ద్విచక్రవాహనదారులు డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మలుపులు దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాల గురించి ముందుగా సమాచారం అందుతుంది. కారు నడుపుతున్నప్పుడు అయితే స్క్రీన్‌పై ఎదురుగా వస్తున్న వాహనాలకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. అంతేకాదు... వాహనాలకు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తులు, పోలీసులకు అందుతుంది. కారు రిపేరు అయిన సమయంలో దీని ద్వారా మెకానిక్‌ను సంప్రదించొచ్చు. ఈ మొత్తం వ్యవహారాలను మొబైల్‌ ఆప్‌తో పర్యవేక్షించొచ్చు కూడా. 
https://goo.gl/xdBOMo

Posted On 18th February 2017

Source eenadu