నీటి వడపోత ఎక్కువైతే ఆస్తమా
నీటి వడపోత ఎక్కువైతే ఆస్తమా

తల్లిదండ్రులూ జాగ్రత్త! పిల్లలకు బాగా వడిపోసిన మంచినీరు ఇస్తున్నారా? ఇవి వారిలో ఆస్తమా ముప్పునకు కారణమవుతాయని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఆరోగ్యకర సూక్ష్మజీవులు చనిపోవడమే దీనికి కారణమని చెబుతోంది. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా వర్సిటీ (యూబీసీ) నిపుణులు దీన్ని చేపట్టారు. ఆస్థమా ముప్పు ఎక్కువగా ఉండే ఈక్వెడార్‌ చిన్నారులు దీనిలో పాలుపంచుకున్నారు. ఈ వ్యాధిని అడ్డుకోవడంలో కీలకంగామారే సూక్ష్మజీవులపై పరిశోధకులు దృష్టిసారించారు. నీటిని బాగా వడపోయడంతో ఇవి చనిపోతున్నట్లు గుర్తించారు. ఈ నీరును తాగడంతో ఆస్థమా లక్షణాలను తట్టుకునే సామర్థ్యం తగ్గడంతోపాటు.. పిచియాగా పిలిచే ఓ రకం ఈస్ట్‌ స్థాయిలు జీర్ణాశయంలో పెరుగుతున్నట్లు తేల్చారు. పిచియాతో పిల్లల్లో ఆస్తమా ముప్పు తీవ్రంగా పెరుగుతున్నట్లు ఇదివరకటి పరిశోధనల్లోనే తేలింది. ‘మంచి నీరు తాగడం మంచిదే. కానీ వాటిలో ఆరోగ్యానికి మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోకుండా చూసుకోవాలి’అని పరిశోధకులు బ్రెట్‌ ఫిన్లె వివరించారు.

Posted On 19th February 2017

Source eenadu