షుగర్‌కు శాశ్వత పరిష్కారం...ప్రయోగ దశలో నూతన విధానం
షుగర్‌కు శాశ్వత పరిష్కారం...ప్రయోగ దశలో నూతన విధానం

మధుమేహాన్ని పూర్తిగా నయం చేస్తే.. మళ్లీ మళ్లీ మందు బిళ్లలు.. ఇన్సులిన్‌ అవసరం లేకుండా ఓ చిన్నపాటి ఆపరేషన్‌తో దీనికి పూర్తిగా చెక్‌ పెట్టేస్తే.. మానవ జాతికి ఇంతకన్నా మహాభాగ్యం మరోటి ఉండదు. ఆ మహాభాగ్యాన్ని త్వరలో మన భాగ్యనగరి కల్పించబోతోంది. ఇక్కడి వైద్యులు ఎండోస్కోపీ చికిత్సా విధానంతో మధుమేహాన్ని పూర్తిగా నియంత్రణలోకి తేవచ్చని గుర్తించారు. ఈ విధానాన్ని 

ఏడుగురు రోగులపై పరిశీలించగా అది విజయవంతమైంది కూడా. దీంతో మరింత మంది మధుమేహులకు ఈ చికిత్సను అందించి.. వారిలో వచ్చే ఫలితాలను ఆధారం చేసుకుని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధానం వినియోగంలోకి వస్తే భవిష్యతలో మధుమేహ బాధితులు మందులు, ఇన్సులిన్‌ వాడాల్సిన అవసరంలేదని ఏషియ న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మొదటి వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ జీఐ ఎండోస్కోపీ(ఎండో 2017) సందర్భంగా హెచ్‌ఐసీసీలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు వైద్యులు డాంగ్‌ వాన్‌ సీ, ఫాబిన్‌ ఎమ్యురా, లార్స్‌ అబ్‌ఖాన్‌, హోర్‌స్ట్‌, జాన్‌ ఫ్రాంకోస్‌ రే, రాబ ర్ట్‌ బెయిలీ, ఇబ్రహీం ముస్తఫా, జెర్మో డివే తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎండోస్కోిపీ విధానంతో మధుమేహా న్ని నియంత్రణలో పెట్టేందు కు విస్తృత పరిశోధనలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉందని, త్వరలో ఈ విధానంలో చికిత్స అందిస్తాన్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 3 నెలల క్రితం ఏడుగురు రోగులకు ఎండోస్కోపితో మధుమేహాన్ని నియంత్రించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 200మందికి ఈ విధానం ద్వారా డయాబెటి్‌సను అదుపులో పెట్టినట్లు చెప్పారు. క్లోమంలో ఇన్సులిన్‌ హెచ్చు తగ్గులవల్లే రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణలో ఉండదని భావించడం సరికాదని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. చిన్నపేగుల్లోనూ ఇన్సులిన్‌ ఉత్పత్తి ఉంటుందని, దానిలో మార్పులు చేసి డయాబెటి్‌సను అదుపులో పెట్టవచ్చన్నారు. ఎండోస్కోపితో చిన్న పేగుల్లో ఇన్సులిన్‌ను ఎక్కువ, తక్కువ చేయొచ్చన్నారు. చిన్నపేగుల్లో మ్యూకోజ్‌ను 80 డిగ్రీల వద్ద కాల్చడం (బర్న్‌) వల్ల ఇన్సులిన్‌ తగిన మోతాదులో ఉత్పత్తి అవుతుందన్నారు. తరువాత చిన్నపేగును ఒక పొర(స్లీ్‌ప)తో కవర్‌ (పూడ్చడం) చేస్తామన్నారు. తద్వారా క్లోమంలో ఇన్సులిన్‌ క్రమబద్ద్ధీకరించవచ్చని పరిశోధనలో తేలిందన్నారు.

మొబైల్‌వ్యాన్‌తో శిబిరాలు 
ఆధునిక చికిత్స విధానాలను గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రితో మాట్లాడి గ్రామాల్లో మొబైల్‌ వ్యాన్ల ద్వారా వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. మొదటి వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ జీఐ ఎండోస్కోిపీ (ఎండో 2017) కార్యక్రమానికి 20 దేశాల నుంచి వైద్య నిపుణులు వచ్చారని.. ఇందులో ఎండోస్కోిపీ విధానంలో ఉన్న ఆధునిక చికిత్స విధానాలపై చర్చించినట్లు చెప్పారు. 

సర్జరీ లేకుండా కేన్సర్‌కు చెక్‌

జీర్ణకోశ కేన్సర్‌తో బాధపడే రోగులకు ఎలాంటి ఆపరేషన్‌ లేకుండా కేవలం ఎండోస్కోపితో నియంత్రించే అవకాశముందని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మొదటి, రెండో దశ కేన్సర్‌కు ఈ విధానంతో చెక్‌ పెట్టవచ్చన్నారు. ఎండోస్కోపితో అన్ని రకాల కేన్సర్లను నియంత్రించవచ్చన్నారు. తద్వారా కీమోథెరపీ, రేడియేషన్‌ అవసరం ఉండవని వివరించారు. అమెరికా, జపాన్‌లో 40 ఏళ్లు దాటితే కేన్సర్‌ స్ర్కీనింగ్‌ తప్పని సరిగా చేయించుకోవాలనే నిబంధన ఉందని.. లేకుంటే జరిమానా విధిస్తారని తెలిపారు. ఇక్కడ కూడా 40 ఏళ్లు నిండిన ప్రజలు తప్పని సరిగా కేన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవాలని నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.

Posted On 20th February 2017

Source andhrajyothi