ఈ హార్మోన్‌ కొవ్వును కరిగిస్తుంది
ఈ హార్మోన్‌ కొవ్వును కరిగిస్తుంది

పేరుకుపోయిన కొవ్వును కరిగించే హార్మోన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ద్వారా భవిష్యత్తులో కొవ్వును కరిగించే కొత్త రకం మందులను అభివృద్ధి చేయవచ్చని అమెరికాలోని స్ర్కిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతి పరిశోధకురాలు సుప్రియా శ్రీనివాసన్‌ తెలిపారు. ఆమెతోపాటు కొందరు పరిశోధకులు వానపాములపై పరిశోధనలు చేశారు. వాటి మెదడులోని సెరోటోనిన్‌, కొవ్వు కరగడానికి మధ్య గల సంబంధాన్ని పరిశీలించారు. దీనికి న్యూరోపెప్టైడ్‌ అనే హార్మోన్‌ కారణమని వారు గుర్తించారు. దానికి ఎఫ్‌ఎల్పీ-7 అని నామకరణం చేశారు. ఈ ఎఫ్‌ఎల్పీ-7కు, మెదడులోని సెరోటోనిన్‌ స్ధాయిలకు ప్రత్యక్ష సంబంధం ఉందని వారు గుర్తించారు. పేగుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ప్రక్రియలో ఎఫ్‌ఎల్పీ-7 కీలకమైన పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు. ఎఫ్‌ఎల్పీ-7పై మరిన్ని పరిశోధనలు జరిపిన అనంతరం మానవులలో దీని పనితీరును పరిశీలించాల్సి ఉందని శ్రీనివాసన్‌ చెప్పారు. 

Posted On 20th February 2017

Source andhrajyothi