జ‌గ‌న్‌ అతి స్పందనే నాకు కలిసొచ్చింది
జ‌గ‌న్‌ అతి స్పందనే నాకు కలిసొచ్చింది

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా తరఫున గెలుపొందిన బీటెక్‌ రవి మీడియాతో మాట్లాడారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై నమ్మకం లేకనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని అన్నారు. జిల్లాలో నాయకుల సమష్టి కృషివల్లే తాను గెలిచానని, తనపై నమ్మకం ఉంచి సీటు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ అతిగా స్పందించడం తమకు కలిసి వచ్చిందని చెప్పారు. కడప జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందని రవి అన్నారు.

Posted On 20th March 2017

Source eenadu