సంజయ్‌దత్‌కు తీవ్రగాయాలు
సంజయ్‌దత్‌కు తీవ్రగాయాలు

బాలీవుడ్‌ అగ్రహీరో సంజయ్‌దత్‌ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ‘భూమి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చంబల్‌లో జరుగుతోంది. దీనిలో సంజయ్‌ని కొందరు దుండగులు వెంటాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సన్నివేశంలో సంజయ్‌ పరిగెడుతుండగా కిందపడటంతో గాయపడ్డారు. అప్పటికీ పట్టించుకోకుండా పెయిన్‌కిల్లర్‌ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. నొప్పి పెరిగిపోవటంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి పక్కటెముకలు విరిగాయని చెప్పారు. కొన్ని రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

గతంలో కూడా ఇదే చిత్ర షూటింగ్‌లో సంజయ్‌దత్‌ తలకు గాయమైంది. జైలు నుంచి విడుదలయ్యాక సంజూబాబా నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.

Posted On 21st March 2017

Source eenadu