మణిరత్నం ‘చెలియా’ సెకండ్ ట్రైలర్

కార్తీ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘చెలియా’ చిత్రం పాటలు విడుదలయ్యాయి. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరపరిచిన ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం మంగళవారం పార్క్‌ హయత్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కార్తీ, అదితిరావు హైదరి, మణిరత్నం, సుహాసిని, ఎ.ఆర్‌. రెహమాన్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో కార్తీ పైలెట్‌గా, అదితి వైద్యురాలిగా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ‘చెలియా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted On 21st March 2017

Source eenadu