మార్చి 19న శ్రీలంక క్రికెట్ చనిపోయింది
మార్చి 19న శ్రీలంక క్రికెట్ చనిపోయింది

2017 మార్చి 19న శ్రీలంక క్రికెట్ చనిపోయిందంటూ శ్రీలంకలో ఒక స్థానిక మీడియా సంస్థ వార్తను ప్రచురించింది. రిప్ శ్రీలంక క్రికెట్ అంటూ కథనాన్ని ప్రచారం చేసింది. మీడియా శ్రీలంక క్రికెట్‌పై పూర్తి స్థాయిలో విరుచుకుపడింది. ఇక క్రికెట్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం పసికూన బంగ్లాదేశ్‌పై శ్రీలంక జట్టు 19న సెకండ్ టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోవడమే. శ్రీలంకను సొంత గడ్డపై ఓడించడమంటే మామూలు విషయం కాదు. కొద్దిరోజుల క్రితం ఆసీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ గురయ్యింది. అలాంటిది బంగ్లా జట్టు తన వందో టెస్టులో శ్రీలంకపై చారిత్రాత్మక విజయం సాధించి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Posted On 21st March 2017

Source andhrajyothi