తండ్రి కాబోతున్న చెర్రీ
తండ్రి కాబోతున్న చెర్రీ

మెగా అభిమానులను సంతోష పరిచే విషయమిది. ఐదేళ్ల క్రితం ఉపాసనను ప్రేమ వివాహం చేసుకున్న రామ్ చరణ్.. ఎప్పుడెప్పుడు బుల్లి మెగా పవర్ స్టార్‌ను అందిస్తాడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అతి త్వరలోనే ఈ కోరిక నెరవేరబోతోందట. కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే పిల్లల విషయంలో గ్యాప్ తీసుకున్న చరణ్.. అతి త్వరలో తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆల్రెడీ మెగా క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొందట. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు.

Posted On 21st March 2017

Source andhrajyothi