పందులతో పోల్చి.. క్షమాపణ చెప్పిన నాని
పందులతో పోల్చి.. క్షమాపణ చెప్పిన నాని

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సభలో క్షమాపణ చెప్పారు. మంగళవారం అసెంబ్లీ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంతీరు కుక్క తోక వంకరలా ఉందని బుచ్చయ్య చౌదరి అనడంతో ఆగ్రహం చెందిన నాని.. బురదలో పొర్లాడే పందులంటూ అధికార పక్షాన్ని దుర్భాషలాడారు. కొడాలినాని పదజాలంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడాలినానిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో కొడాలినాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పారు.

Posted On 21st March 2017

Source andhrajyothi