నోట్ల రద్దు వల్ల ఎలాంటి సమస్య రాలేదు
నోట్ల రద్దు వల్ల ఎలాంటి సమస్య రాలేదు

పెద్ద నోట్ల రద్దు వల్ల ఎలాంటి సమస్య రాలేదని, అయితే ఈ పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. మంగళవారం లోక్ సభలో ఆమె మాట్లాడుతూ బ్రిటిష్‌ సంప్రదాయాలకు స్వస్తి పలికారని మోదీని కొనియాడారు. బడ్జెట్‌లో ఎన్నో సానుకూల అంశాలున్నాయని, సంక్షేమ పథకాలకు ఈ సారి నిధులు పెంచారని కవిత అన్నారు. గత ఏడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Posted On 21st March 2017

Source andhrajyothi