ఆసక్తికరంగా ‘కేశవ’ టీజర్‌

‘భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని.. వైప్లవ్య గీతాన్ని నేను.. స్మరిస్తే పద్యం.. అరిస్తే వాద్యం.. అనల వేదిక ముందు అస్ర నైవేద్యం’ శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఈ మాటలను ఇప్పుడు నటుడు నిఖిల్‌ చెబుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కేశవ’. సుధీర్‌వర్మ దర్శకుడు. మంగళవారం చిత్ర టీజర్‌ విడుదలైంది. రక్తపాతాన్ని తలపించిన ఈ టీజర్‌లో నిఖిల్‌పై డైలాగ్‌ చెబుతూ ఆసక్తికరంగా కనిపించారు. ఇది వరకూ చిత్రాలతో పోలిస్తే ఇందులో ఆయన లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ‘కేశవ’ తెరకెక్కుతోంది. సన్నీ ఎమ్‌.ఆర్‌. బాణీలు సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted On 21st March 2017

Source eenadu