విమానాశ్రయాల పేర్ల మార్పు
విమానాశ్రయాల పేర్ల మార్పు

రాష్ట్రంలోని రెండు ప్రధాన విమానాశ్రయాలకు పేర్లు మారుస్తూ శాసనమండలి తీర్మానం చేసింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరు, తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వరస్వామి పేర్లు పెడుతూ శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువైన ప్రాంతం కావడంతో తిరుపతి విమానాశ్రయానికి స్వామివారి పేరు పెడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేసిన నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లా వాసి కావడంతో గన్నవరం విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం సముచితమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు విమానాశ్రయాల పేర్లు మారుస్తూ మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండానే ఆమోదం పొందాయి.

Posted On 21st March 2017

Source eenadu