శ్రీసిటీ లో Xiaomi ( Mi ) రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌
శ్రీసిటీ లో Xiaomi ( Mi ) రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌

చైనా మొబైల్‌ ఫోన్ల కంపెనీ షామీ.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఫాక్స్‌కాన్‌తో కలిసి ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2014 జూలైలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన షామీ.. ఏడాది కాలంలోనే దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రారంభిం చింది. 2015 ఆగస్టులో మొదటి ప్లాంట్‌ ఉత్పత్తిని ప్రారంభిం చింది. మార్చి 2016 నాటికి 75 శాతానికి పైగా ఫోన్లు భారత లోనే తయారయ్యాయని కంపె నీ పేర్కొంది. కొత్త యూనిట్‌ కోసం ఎంత మొత్తం వెచ్చించే విషయాన్ని కంపెనీ వెల్లడిం చలేదు. ఈ ప్లాంట్‌ సామర్థ్యం కలిపితే సెకనుకు ఒక ఫోన్‌ను తయారు చేసే సామర్థ్యం తమ కంపెనీకి ఉంటుందని షామీ ఇండియా హెడ్‌ మనూ జైన్‌ తెలిపారు. కొత్త యూనిట్‌తో భారతలో విక్రయించే 95 శాతం ఫోన్లు ఇక్కడ తయారై నవే అవుతాయని చెప్పారు. ఈ ప్లాంట్‌తో ఐదువేలకు పైగా ఉద్యోగాలను కల్పించే అవకాశం ఏర్పడిందని, మొత్తం సిబ్బందిలో 90 శాతానికి పైగా మహిళలే ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. 

రెడ్‌మి 4ఎ విడుదల: ధర రూ.5,999
రెడ్‌మి 4ఎ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను షామీ విడుదల చేసింది. దీని ధర 5,999 రూపా యలు, మిడాట్‌కామ్‌, అమెజాన్‌ ఇ-కామర్స్‌ సైట్‌లో మార్చి 23న ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.


5 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్‌ సిమ్‌, ఎల్‌టిఇ, వోల్టే సపోర్ట్‌, 1.4 గిగాహెట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 3120 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 13 ఎంపి వెనుక, 5ఎంపి ముందు కెమెరాలు, 2జిబి రామ్‌, 16జిబి ఫ్లాష్‌ మెమరీ (128 జిబి వరకు పెంచుకోవచ్చు), ఐఆర్‌ బ్లాస్టర్‌ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.  

Posted On 22nd March 2017

Source andhrajyothi