పవన్‌ నవ్వుకు కారణం చెప్పిన అలీ
పవన్‌ నవ్వుకు కారణం చెప్పిన అలీ

‘కాటమరాయుడు’ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకలో కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. దీంతో పక్కనున్న అలీ వేసిన జోక్‌కు ఆయన అంతలా నవ్వారని భావించారు. దీంతో అసలు అక్కడ ఏం జరిగిందో అని అభిమానుల మధ్య పెద్ద చర్చే నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అలీ పవన్‌ నవ్వుకు కారణం చెప్పాడు. ప్రీ-రిలీజ్‌ వేడుకలో వేదికపై మాట్లాడుతున్న నిర్మాత.. ‘జుబ్బాలో పవన్‌ అందం రెట్టింపైంది’ అని అన్నారు. ఇదే సమయంలో పక్కనున్న వారితో ఏంటి హ్యాండ్సమ్‌గా ఉన్నారు.. హ్యాండ్సమ్‌గా ఉన్నారు.. అని అన్నిసార్లు అంటున్నారు.. కొంపదీసి మళ్లీ పెళ్లి చేస్తారా ఏంటి?’ అని అన్నానని అలీ వివరించారు. ఈ మాటలు విన్న పవన్‌ ఒక్కసారిగా పగలబడి నవ్వారని అలీ చెప్పారు. ఇది జరిగిన తర్వాత పవన్‌ ఎందుకు నవ్వారో తెలుసుకునేందుకు చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని ఆయన తెలిపారు.

Posted On 22nd March 2017

Source eenadu