కాటమరాయుడు ‘జివ్వు జివ్వు’ సాంగ్ ప్రోమో

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘జివ్వు జివ్వు’ అనే పాట ప్రోమోను చిత్ర బృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. అందులో కాటమరాయుడు తన తమ్ముళ్లు, అలీతో కలిసి పంచెకట్టులో తెగ చిందులేస్తూ కనిపించారు. పవన్‌ హుషారుగా ఆడిపాడుతున్న ఈ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. దీంతో పాటు మరికొన్ని ప్రచార చిత్రాలను యూనిట్‌ విడుదల చేసింది.

తమిళ చిత్రం ‘వీరమ్‌’కి రీమేక్‌గా దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూర్చారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ చిత్రాన్ని నిర్మించారు. కమల్‌ కామరాజు, అజయ్‌, శివబాలాజీ, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Posted On 22nd March 2017

Source eenadu