ఏపీ లో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణి
ఏపీ లో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణి

రాష్ట్రంలోని 7,400 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 24వ తేదీన అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ రిజిస్ర్టార్‌ సంబంగి అప్పలనాయుడు తెలిపారు. అవుట్‌ గోయింగ్‌ విద్యార్థులకు కాకుండా ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు ఈ ల్యాప్‌టాప్‌లు సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులు తమ అకాడమిక్‌ ఇయర్‌లో అవసరమైన విద్యాసంబంధిత సమాచారాన్ని పొందేందుకు ల్యాప్‌టాప్‌లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. త్వరలోనే పీజీ సీట్లు ఎన్ని ఉంటాయనేది క్లారిటీ రానున్నదని చెప్పారు. వెంటనే అడ్మి షన ప్రొసెస్‌ కూడా నిర్వహించడానికి యూనివర్శిటీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

Posted On 23rd March 2017

Source andhrajyothi