ఏపీ కి స్టేట్‌ ఆఫ్‌ది ఇయర్‌ పురస్కారం‌
ఏపీ కి స్టేట్‌ ఆఫ్‌ది ఇయర్‌ పురస్కారం‌

వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ కనబరిచిన పనితీరుకు గుర్తింపుగా ప్రముఖటీవీ ఛానల్‌ సీఎన్‌బీసీ ఏపీకి ఈ ఏడాది అత్యుత్తమ రాష్ట్రం(స్టేట్‌ ఆఫ్‌ది ఇయర్‌) పురస్కారాన్ని ప్రదానం చేసింది. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నుంచి ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ఆరోఖ్యరాజ్‌, ఎంపీలు మురళీమోహన్‌, అవంతి శ్రీనివాస్‌లు సంయుక్తంగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం, స్వచ్ఛభారత్‌ లక్ష్యాన్ని సాధించడమే తమ ప్రధాన కర్తవ్యమని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దీన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Posted On 24th March 2017

Source eenadu