కుమార్తె పుట్టినరోజు వేడుకలో పవన్‌
కుమార్తె పుట్టినరోజు వేడుకలో పవన్‌

పవన్‌కల్యాణ్‌-రేణు దేశాయ్‌ల కుమార్తె ఆద్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్‌కల్యాణ్‌ స్వయంగా ఆద్య జన్మదిన వేడుకలో పాల్గొని కేక్‌ తినిపించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలో పవన్‌ పాల్గొన్న ఫొటోలను రేణుదేశాయ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘తమ బిడ్డల పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన బహుమతి వారితో గడిపే సమయమే’ అని రేణు ట్వీట్‌ చేశారు.

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘కాటమరాయుడు’ శుక్రవారం విడుదలైంది. డాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది.

Posted On 24th March 2017

Source eenadu