టీమిండియా, కోహ్లీపై ఆసిస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా, కోహ్లీపై ఆసిస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా, కోహ్లీపై 8 వికెట్లు తీసి భారత జట్టును బోల్తా కొట్టించిన ఆసిస్ బౌలర్ నాథన్ లియాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాము తలను కత్తిరిస్తే మిగతా శరీరం కూడా వెంటనే కుప్పకూలుతుందని వ్యాఖ్యానించాడు.  లియాన్ పాము తల అని కోహ్లీని ఉద్దేశించి అన్నాడు. తాను సిరీస్‌కు ముందు అశ్విన్ బౌలింగ్‌ను బాగా పరిశీలించానని, తద్వారా ఉపఖండపు పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలో గమనించానని కూడా చెప్పాడు. సెకండ్ టెస్ట్ తొలి రోజు ఆటలో లియాన్ 50 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీయడంతో భారత జట్టు 189 పరుగులకే ఆలౌటయ్యింది. అయితే కోహ్లీ 17 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Posted On 4th March 2017

Source andhrajyothi