టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా

టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా నలుగురు బౌలర్లు ఆరేసి వికెట్లు సాధించారు. ఈ రికార్డు బెంగళూరులో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో సాధ్యమైంది. ఆసీస్ సిన్నర్ నాథన్ లియాన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 50 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో అదే జట్టు ఫాస్ట్ బౌలర్ హాజల్‌వుడ్ 67 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. భారత్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో, రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరేసి వికెట్లు సాధించారు. జడేజా 63 పరుగులివ్వగా, అశ్విన్ 41 పరుగులకే ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. 4 టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి.

Posted On 7th March 2017

Source andhrajyothi