నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కాలంలో రవిశాస్త్రి క్రికెట్‌ చూడలేదేమో
నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కాలంలో రవిశాస్త్రి క్రికెట్‌ చూడలేదేమో

టీమ్‌ఇండియా అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో రవిశాస్త్రి తనను చేర్చకపోవడంపై సౌరభ్‌ గంగూలీ కాస్త ఆలస్యంగా స్పందించాడు. ఐతే ఆలస్యమైనా గంగూలీ తనదైన శైలిలోనే రవిశాస్త్రికి చురక అంటించాడు. ఓ బెంగాలీ కామెడీ షోలో పాల్గొన్న సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘నేను టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఉన్న కాలంలో రవిశాస్త్రి క్రికెట్‌ చూడలేదేమో’’ అన్నాడు గంగూలీ. ఇక నాయకత్వ లక్షణాల్లో కుంబ్లేకు, రవిశాస్త్రికి పోలిక పెడుతూ, కుంబ్లేకు పదికి తొమ్మిది మార్కులిచ్చిన సౌరభ్‌.. రవికి ఏడు మార్కులే ఇచ్చాడు. ఇటీవలే మహేంద్ర సింగ్‌ ధోని టీమ్‌ఇండియా వన్డే, టీ20 పగ్గాలు వదులుకున్న సమయంలో భారత అత్యుత్తమ కెప్టెన్లంటూ ధోని, కపిల్‌ దేవ్‌, అజిత్‌ వాడేకర్‌ల పేర్లు చెప్పిన రవిశాస్త్రి.. గంగూలీ పేరు మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సమయంలో టీమ్‌ఇండియా పగ్గాలందుకున్న గంగూలీ.. జట్టును అద్భుతంగా నడిపించి, ప్రపంచ అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిపాడు.

Posted On 7th March 2017

Source andhrajyothi