కోహ్లీసేనకు ICC బంపర్‌ ఆఫర్‌...10 లక్షల డాలర్లు బహుమానం
కోహ్లీసేనకు ICC బంపర్‌ ఆఫర్‌...10 లక్షల డాలర్లు బహుమానం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ ఇండియా 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీసేన బంపర్‌ ఆఫర్‌ అందుకోనుంది. ఏప్రిల్‌ 1 నాటికి టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉన్న జట్టుకు ఐసీసీ ఒక మిలియన్‌ డాలర్లను నజరానాగా అందించనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత జట్టు 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కాగా, ఆ వెనుకే ఆస్ట్రేలియా 109 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇరు జట్లకు 12 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఆసీస్‌పై రెండో టెస్టు గెలిచిన సందర్భంగా ఐసీసీ ఓ ట్వీట్‌ చేసింది. ‘ఆస్ట్రేలియాపై భారత్‌ రెండో టెస్టు గెలుపొందడంతో ఏప్రిల్‌ 1 నాటికి నెం.1 స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా 1 మిలియన్‌ డాలర్ల నజరానా అందుకుంటుంది’ అని పేర్కొంది.

Posted On 7th March 2017

Source eenadu