ఎన్టీఆర్ ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’
ఎన్టీఆర్ ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’

టెంపర్ ముందు వరకు వరుస ఫ్లాపుల తో సతమతమయిన ఎన్టీఆర్, టెంపర్ సినిమా తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. రభస, రామయ్య వస్తావయ్య లాంటి సినిమాల్లో రొటీన్ పాత్రలు పోషించి అవి పరాజయం పాలవ్వడంతో తనను తాను మార్చుకొని టెంపర్ సినిమాలో కనిపించిన విధానం, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రదర్శించిన నటనతో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా పొందాడు.

ఇంక ఆ సినిమా తర్వాత కథల విషయంలో, పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథ కొత్తగా ఉండి నటనకు ఆస్కారం ఉన్న కథలనే ఎంచుకుంటున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజి సినిమాలే ఇందుకు ఉదాహరణ.

‘జీ’ తెలుగు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ సినిమా అవార్డ్స్ లో 2016 కు గాను ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’ అవార్డును అందుకున్నాడు. 2016 లో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో 55 కోట్ల షేర్, జనతాగ్యారేజి సినిమా 82 కోట్ల షేర్ మొత్తంగా 135 కోట్ల పైబడి షేర్ సాధించాయి. అయితే మరోవైపు సమంత ‘క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్’ అవార్డు అందుకున్నారు.. జనతా గ్యారేజి, అ ఆ సినిమాలకు గాను ఆమె ఈ అవార్డు అందుకున్నారు.

Posted On 25th March 2017