‘పట్టిసీమ’ కు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’ లో చోటు
‘పట్టిసీమ’ కు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’ లో చోటు

పట్టిసీమ ప్రాజెక్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అతితక్కువ కాలంలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. దేశంలోనే అతితక్కువ కాలంలో (173 రోజులు)లో పూర్తయిన ప్రాజెక్టుగా పట్టిసీమకు గుర్తింపు లభించింది. అంతే కాకుండా పట్టిసీమకు జాతీయస్థాయి గుర్తింపు కూడా లభించింది. ఒక చోట వరదలతో ఊర్లకు ఊర్లు మునిగిపోతుంటే, మరోచోట తాగడానికి నీరు లేక కరువుతో జనం గొంతెండిపోతోంది. దీన్ని నివారించడానికి నదుల అనుసంధానం ప్రముఖం అనే వాదన బలంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ త్వరితగతిన పూర్తవ్వడం పట్ల ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Posted On 25th March 2017

Source andhrajyothi