రిలయన్స్‌ జియో మరో భారీ ఆఫర్‌
రిలయన్స్‌ జియో మరో భారీ ఆఫర్‌

టెలికాం సేవలను ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోట్ల మంది చందాదార్లను సొంతం చేసుకుంది రిలయన్స్‌ జియో. ప్రస్తుతం మార్చి 31వరకూ ఉచిత డేటా, కాల్స్‌ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌ 1 నుంచి ప్రత్యేక ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా జియో సేవలను పొందవచ్చు. అయితే ఇందుకోసం జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెర్రిల్‌ లించ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం. ఇప్పటివరకూ 84శాతం మంది జియో ప్రైమ్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్నారట. ఈ సందర్భంగా జియో తన చందాదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.

ఏప్రిల్‌ 1 కన్నా ముందే రీఛార్జ్‌ చేసుకుంటే 10జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇప్ప‌టికే ప్రైమ్ స‌బ్‌స్క్రైబ్ చేసుకున్న‌వారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. ఇక జియో ప్లాన్స్ అయిన‌ రూ.149 పథకం కింద 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్‌, అదనంగా 1జీబీ డేటాను అందించనుంది. ఇక రూ.303 ప్లాన్‌లో ఇచ్చే 28 జీబీ డేటాతో పాటు ఉచితంగా మరో 5జీబీ డేటాను జియో ఇవ్వనుంది. ఈ రెండింటితో పాటు రూ.499 రీఛార్జ్‌ను కూడా నెలవారీ పథకం కింద అందిస్తోంది.

Posted On 25th March 2017

Source eenadu