కోహ్లీపై నటి వేధింపుల కేసు
కోహ్లీపై నటి వేధింపుల కేసు

‘భాబీ జీ ఘర్ పర్ హై’ టీవీ షో‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి శిల్పాషిండే... ఆ టీవీ షో ప్రొడ్యూసర్ సంజయ్ కోహ్లీపై కేసుపెట్టింది. సంజయ్ కోహ్లీ తనను లైంగికంగా వేధిస్తున్నాడనీ... చెప్పరాని మాటలతో పిలుస్తూ పలుమార్లు లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. తాను చెప్పినట్టు చేయకపోతే టీవీ షో నుంచి తొలగిస్తానంటూ బెదిరించాడని ఆరోపించింది. షూటింగ్ సందర్భంగా తనను అసభ్యంగా తాకాడని ఆరోపించింది. అందుకే సదరు టీవీ షోలో నటించడం మానేశానని వెల్లడించింది. అయితే శిల్పా కావాలనే సంజయ్ కోహ్లీపై ఆరోపణలు చేస్తోందని ఆయన సన్నిహితులు వాదిస్తున్నారు. మరోవైపు శిల్పా తమ షోలో నటించని కారణంగా రూ.12.5 కోట్లు నష్టం వాటిల్లిందంటూ నిర్మాతలు ఆమెపై కేసుపెట్టారు. అయితే ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికీ తనుకు రూ.32 లక్షలు ఇవ్వాల్సి ఉందని శిల్పా చెబుతోంది.

Posted On 25th March 2017

Source andhrajyothi