ట్విట్టర్ లో కొత్తగా లైవ్ ఆప్షన్
ట్విట్టర్ లో కొత్తగా లైవ్ ఆప్షన్

సామాజిక అనుసంధాన వేదికల ప్రత్యక్ష ప్రసారాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ సాంకేతికతతో ప్రత్యక్ష ప్రసారాల్లో నాణ్యతతోపాటు, ఆప్షన్లు కూడా పెరిగాయి. ఈ సాంకేతికతతో త్వరలో ట్విట్టర్‌లో లైవ్‌ వీడియోలు పోస్ట్‌ చేయొచ్చు. ఇప్పటికే పెరీస్కోప్‌ ద్వారా ట్విట్టర్‌ ప్రత్యక్ష ప్రసారాల సౌకర్యం అందిస్తోంది. అయితే ఈ కొత్త సౌకర్యం ద్వారా వీడియోలను ప్రాథమికంగా ఎడిటింగ్‌ కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది. దీని సాయంతో క్రీడల పోటీలు, బహిరంగ సభలు లాంటివాటిని ట్విట్టర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చు. ఫేస్‌బుక్‌ ఇప్పటికే ఈ తరహా సౌకర్యాన్ని అందిస్తోంది.

Posted On 25th March 2017

Source eenadu