‘కళ్లు తిరిగే’ మేకప్‌
‘కళ్లు తిరిగే’ మేకప్‌

సాధారణంగా మగువలు తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి మేకప్‌ వేసుకుంటారు. ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి’ అన్నట్టు ఈ ఫొటో చూస్తే ఇలా కూడా మేకప్‌ వేసుకుంటారా? అని నోరెళ్ల బెట్టాల్సిందే. వాంకోవర్‌కు చెందిన మేకప్‌ ఆర్టిస్ట్‌ మిమిచౌ మాత్రం మామూలు మేకప్‌లకు భిన్నంగా మేకప్‌లు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆమె వేసిన కొన్ని మేకప్‌లు చూస్తే ముచ్చటేస్తుంది.. మరికొన్ని చూస్తే ఒళ్లు గగురుపొడుస్తుంది.. ఇంకొన్ని చూస్తే ‘కళ్లు’ తిరగాల్సిందే. చౌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని 1.2లక్షల మంది ఫాలో అవుతున్నారంటే యువతలో ఆమె మేకప్‌లకు ఎంత క్రేజ్‌ ఉందో ఇట్టే అర్థమవుతుంది. అయితే అన్నింటికన్నా నూతన వధువుకు ఆమె చేసే మేకప్‌నకు ఉండే క్రేజ్‌ వేరట. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కొన్ని ఫొటోలు మీ కోసం..

Posted On 25th March 2017

Source eenadu