ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌‌కు అరుదైన అవకాశం
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌‌కు అరుదైన అవకాశం

నవ్యాంధ్ర రాజధాని అమరావ తిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో శనివారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ప్యానల్‌ స్పీకర్‌గా ఎంపికయ్యి మొదటి సారిగా శాసనసభ స్పీకర్‌ స్ధానంలో కూర్చుని 30 నిమిషాలపాటు సభను సమర్ధవంతంగా నిర్వహించారు.

అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభకు అందుబాటులో లేని సమయంలో ప్యానల్‌ స్పీకర్‌ సీటులో కూర్చుని సభను నిర్వహిం చారు. గద్దె రామ్మోహన్‌ స్పీకర్‌ స్ధానంలో కూర్చున్న సమయంలో ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, విష్ణుకుమార్‌రాజు, సాలూరు రాజన్న దొర మాట్లాడారు. ఎమ్మెల్యే గద్దెను పాలక, ప్రతిపక్ష సభ్యులు అభినందించారు. గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ తనను ప్యానల్‌ స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి సమావేశాల్లోనే తాను స్పీకర్‌ స్దానంలో కూర్చుని సభను నిర్వహించడం చాలా సంతోషంగా హుందా తనంగా ఉందని తన అనుభూతిని వ్యక్తం చేశారు. తాను సభను నిర్వహిస్తున్న సమయంలో సభ్యులు సహకరించారని అన్నారు.

Posted On 26th March 2017

Source andhrajyothi