రెండో కూతురి బర్త్‌డే పార్టీలో పవన్‌
రెండో కూతురి బర్త్‌డే పార్టీలో పవన్‌

తాజాగా ‘కాటమరాయుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇన్నాళ్లూ సినిమాలతో, రాజకీయాలతో బిజీగా గడిపిన పవన్‌ ఈ ఖాళీ సమయాన్ని తన కుటుంబానికి కేటాయించాడు. ‘కాటమరాయుడు’ సినిమా విడుదల ముందు రోజు పుణె వెళ్లి పెద్ద కూతురు ఆద్య బర్త్‌డేను పవన్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు రెండో కూతురు పోలేనా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్‌ చేశాడు పవన్‌. పవన్‌.. తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి పోలేనా బర్త్‌డే పార్టీలో పాల్గొన్నాడు. కాగా, ఏప్రిల్‌ 8న పవన్‌ కొడుకు అకీరా పుట్టినరోజు కూడా రానుంది. ఆ రోజు కూడా పవన్‌ పుణె వెళ్లే అవకాశముంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదలు కాబోయే సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు.

Posted On 26th March 2017

Source andhrajyothi