నాని బాహుబలి అయ్యుంటే...?
నాని బాహుబలి అయ్యుంటే...?

నాని బాహుబలి అయ్యుంటే? భాళ్లాలదేవుడిగా ఎవరైతే బాగుంటుంది?. ‘బాహుబలి ది: కన్‌క్లూజన్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ.. నానిని ఈ ప్రశ్న అడిగారు. ఇందుకు నాని సమాధానం ఇస్తూ.. ‘పుండు మీద కారం చల్లడం అంటే ఇదే.. చేస్తానంటే ఏమీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇలా ప్రశ్న అడుగుతున్నారు. నా సైజుకు తగినట్టు ఉంటే బాగుంటుంది.’ అని అన్నారు. అయితే ఎవరి పేరూ చెప్పకపోవడంతో సుమనే తామోక పేరు అనుకుంటున్నట్టు తెలిపారు. భళ్లాలదేవుడిగా సుదీప్‌ అయితే బాగుంటుందని అనగా, నవ్వులు విరిశాయి. ‘ఈగ 2’ త్వరగా పట్టాలెక్కించాలని నాని రాజమౌళిని కోరారు. దేవసేనగా, శివగామిగా వారిని తప్ప ఎవరినీ వూహించుకోలేమని అన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Posted On 26th March 2017

Source eenadu