కంటతడి పెట్టిన రాజమౌళి
కంటతడి పెట్టిన రాజమౌళి

బాహుబలి డైరక్టర్ రాజమౌళిని సంగీత దర్శకుడు కీరవాణి కంటతడి పెట్టించారు. బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రాజమౌళిపై ఓ పాట రూపొందించి పాడారు. పాడుతూ స్టేజిపైకి రాజమౌళిని పైకి పిలిచారు. పైకి పిలిచిన తర్వాత ఎమోషనల్‌గా పాట పాడారు. పాట వింటూ రాజమౌళి కన్నీరు పెట్టుకున్నారు. కీరవాణి పాట వింటూ రాజమౌళి తండ్రి సహా ఆయన కుటుంబసభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. కీరవాణి రాజమౌళిని ఓదార్చి ఆ తర్వాత ఆశీర్వదించారు. స్టేజీ కిందకు దిగిన తర్వాత కూడా రాజమౌళి అదే భావోద్వేగంలో కొనసాగారు. కీరవాణి స్టేజిపైన ఉన్నంత సేపూ కార్యక్రమానికి హాజరైనవారంతా ఎమోషనల్‌ అయ్యారు.

Posted On 26th March 2017

Source andhrajyothi