బండ్ల గణేష్‌ తోడేలులాంటి వాడు
బండ్ల గణేష్‌ తోడేలులాంటి వాడు

తనను చంపమని గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు హీరో సచిన్‌ జోషి డబ్బులు ఇచ్చాడని, అయితే నయీమ్‌ చనిపోవడంతో తను బతికిపోయానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్‌ చేసిన ఆ ఆరోపణలపై సచిన్‌ జోషి స్పందించాడు. సచిన్‌ నటించిన ‘వీడెవడు’ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ను తీవ్రంగా విమర్శించాడు సచిన్‌.

‘బండ్ల గణేష్‌ మనిషి కాదు. అతను తోడేలులాంటివాడు. నమ్మక ద్రోహం చేశాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. దాదాపు 27 కోట్ల రూపాయల వరకు నాకు రావాలి. ‘ఒరేయ్‌ పండు’ అనే సినిమా షూటింగ్‌ సమయంలో తినడానికి తిండి లేదని నా దగ్గరకు వచ్చాడు. అలా నన్ను నమ్మించి మోసం చేశాడు. అతడి మీద మొత్తం 14 కేసులు పెట్టించాం. అరెస్ట్‌ చేసే సమయంలో ఆయన తండ్రి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు జాలి పడి వదిలేశామ’ని సచిన్‌ వెల్లడించాడు.

Posted On 27th March 2017

Source andhrajyothi