రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం
రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం

తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజు శ్రీవారి ఆదాయం రూ. 5 కోట్లు వచ్చింది. ఈ మేరకు ఆలయ అధికారులు తెలిపారు. పెద్దనోట్ల రద్దు తరువాత భారీఎత్తున శ్రీవారి హుండీ ఆదాయం రావడం ఇదే ప్రథమం. ఎప్పుడు భారీగా వచ్చే హుండీ ఆదాయం పెద్దనోట్ల రద్దు తరువాత పూర్తిగా తగ్గిపోయింది. నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి నేటి వరకూ స్వామివారి ఆదాయం ఈ స్థాయిలో రాలేదు. అయితే ఇవాళ స్వామివారి ఆదాయం రూ. 5 కోట్లకు చేరడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Posted On 27th March 2017

Source andhrajyothi