ఇలా చేస్తే లావు కారు...
ఇలా చేస్తే లావు కారు...

ఊబకాయం బారిన పడతారని భయపడుతున్నారా? కూరగాయలు, పళ్లు బాగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు లావు కూడా కారు. మాంసాహారులు కన్నా శాకాహారులకు ఊబకాయం రిస్కు తక్కువ. నవర్రా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు, ధాన్యాలు వంటివి తినేవారు ఊబకాయం రిస్కున పడ్డం తక్కువని తేల్చారు. అదే మాంసాహారుల్లో ఊబకాయం రిస్కు దాగుందన్నారు. అంతేకాదు మధుమేహం, గుండెజబ్బుల వంటి వాటి బారిన పడకుండా శాకాహారం ప్రొయాక్టివ్‌ రోల్‌ వహిస్తుందన్నారు. శాకాహారం డైట్‌, ఊబకాయుల సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ స్టడీలో పరిశీలించారు. ప్లాంట్‌ ఆధారిత డైట్‌ తీసుకోవడం వల్ల ఊబకాయం పెరిగే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే ప్లాంట్‌ ఆధారిత ఫుడ్‌తోబాటు తక్కువ పరిమాణంలో మాంసం తింటే ఊబకాయం బారిన పడరన్నారు. సో.. సమతులాహారం శరీరానికి మంచిది మాత్రమే కాదు ఊబకాయం రాకుండా శరీరాన్ని నియంత్రణలో పెడుతుంది కూడా. మరింకెందుకు ఆలస్యం? ఆకుకూరలు, పళ్లు, కూరగాయలతోపాటు కొద్దిగా మాంసం కూడా తింటూ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయండి...ఊబకాయం బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

Posted On 23rd May 2017

Source andhrajyothi