బిరియాని అంటే ఇష్టమా...? ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు.
బిరియాని అంటే ఇష్టమా...? ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు.

బిరియానీ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. మధుమేహం నియంత్రణలో ఉండానికి బిరియానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. మధుమేహుల్లో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బేలీఫ్‌ ఎక్స్‌ట్రాని నీళ్లలో కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. బిరియానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడడం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు. దీనిలో కేన్సర్‌ నిరోధక కారకాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కేన్సర్‌ కారకాల ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకనే మసాలా దినుసులు ఎక్కువగా ఉండే బిర్యానీలో దీన్ని వాడుతుంటారట. తద్వారా మసాలా ఎక్కువవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పొచ్చట. 

Posted On 29th June 2017

Source andhrajyothi