యోగా చేసెను అద్భుతం
యోగా చేసెను అద్భుతం

యోగాభ్యాసంతో లభించే ప్రయోజనాలు ఏమిటో చెప్పిన ప్రధాని మోడీకి... యోగా మ్యాట్‌తో ఎవరికీ తెలియని ప్రయోజనం కూడా ఉందని లక్నోవాసులు రుజువుచేసి చూపించారు. వివరాల్లోకి వెళితే... లక్నోలో బుధవారం మోడీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అభ్యాసకుల కోసం మైదానంలో మ్యాట్‌లను పరిచారు. దీనివ
లన యోగాభ్యాసకులకు సౌకర్యంగా ఉంటుందని నిర్వాహకులు భావించారు. అయితే అక్కడకు చేరుకున్న యోగాభ్యాసకులు వర్షం నుంచి తప్పించుకునేందుకు ఆ మ్యాట్‌లను తమపై కప్పుకున్నారు. మరికొందరైతే కార్యక్రమం ముగిసిన తరువాత ఆ మ్యాట్‌లను తడవకుండా కప్పుకుంటూ గేటునుండి మెల్లగా జారుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే గేటు దగ్గరున్న సెక్యూరిటీ సిబ్బంది.. ఆ మ్యాట్‌లను తీసుకుని వారిని పంపింపించడం కొసమెరుపు.
 

Posted On 21st June 2017

Source andhrajyothi