ఆంధ్రా చేపల పులుసు
ఆంధ్రా చేపల పులుసు

కావలసినవి: 
చేపముక్కలు: కిలో, కారం: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, నూనె: అరకప్పు, కొత్తిమీర: కట్ట, మంచినీళ్లు: 2 కప్పులు, చింతపండురసం: 2 కప్పులు, కరివేపాకు: 3 రెబ్బలు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: 4 టేబుల్‌స్పూన్లు, పసుపు: టీస్పూను, ఉప్పు: తగినంత, దనియాలపొడి: టేబుల్‌స్పూను.

తయారుచేసే విధానం: 
* చేపముక్కల్ని ఉప్పు, పసుపు వేసి కడిగి తరవాత కాస్త ఉప్ప, పసుపు పట్టించి పక్కన ఉంచాలి.

* చింతపండుని ఓ గంటముందే గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి రసం పిండాలి.

* మందపాటి గిన్నెలో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, దనియాలపొడి, చింతపండు రసం, నీళ్లు పోసి, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ఓసారి ఉప్పూకారం సరిచూసి, చాలకపోతే మరికాస్త వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మీద తేలినట్లుగా నూనె వేసి మరిగించాలి. తరవాత మంట తగ్గించి సిమ్‌లో పావుగంటసేపు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడి దాదాపుగా ఉడికింది అనుకున్నాక చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి మరో పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. ముక్కల్ని కదపకుండా ఓసారి ఫోర్కుతో ఉడికిందో లేదో చూసి స్టవ్‌ ఆఫ్‌ చేసి కొత్తిమీరతో అలంకరిస్తే సరి.

Posted On 26th August 2017

Source eenadu