స్వీట్‌ కార్న్‌ పాయసం
స్వీట్‌ కార్న్‌ పాయసం

కావలసిన పదార్థాలు:

  • కార్న్‌ - 1 కప్పు,
  • పాలు - 2 టేబుల్‌ స్పూన్లు (కార్న్‌ను నూరటానికి),
  • పాలు - 2 కప్పులు,
  • యాలకుల పొడి - అర టీ స్పూను,
  • నెయ్యి - 1 టేబుల్‌ స్పూను,
  • చక్కెర - 4 టేబుల్‌ స్పూన్లు,
  • పిస్తా పప్పు - 1 టేబుల్‌ స్పూను,
  • కుంకుమ పువ్వు - చిటికెడు.

తయారీ విధానం:

కార్న్‌కు పాలు చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. బాండీలో నెయ్యి వేడి చేసి ఈ కార్న్‌ పేస్ట్‌ను 5 నిమిషాలపాటు వేయించుకోవాలి. తర్వాత రెండు కప్పుల పాలు చేర్చి మళ్లీ మరికొద్ది సేపు వేయించాలి. చిన్న మంట మీద 10 నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత చక్కెర వేసి కరిగేదాకా కలపాలి. కుంకుమ పువ్వును 2 టీస్పూన్ల పాలలో వేసి కలిపి ఉంచుకోవాలి. పాయసం అడుగంటకుండా చిక్కబడేవరకూ కలుపుతూ ఉడికించాలి. నెయ్యి పైకి తేలుతున్నప్పుడు మంట తీసి తరిగిన పిస్తా చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.

Posted On 17th September 2017

Source andhrajyothi