అచ్చొచ్చిన విశాఖ లో... అదరగొట్టిన టీమిండియా
అచ్చొచ్చిన విశాఖ లో... అదరగొట్టిన టీమిండియా

సుందరమైన సాగర తీరంలో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. భారత క్రికెట్ కు కంచుకోటలాంటి విశాఖలో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి 2 - 1 తో సిరీస్ గెలుచుకుంది. ఈ ఏడాది వరుసగా టీమిండియా కు 8వ విజయం. అంతేకాదు శ్రీలంక తో 9 వన్డే సిరీస్ లు ఆడగా అందులో ఒక్కటి కూడా ఓడిపోలేదు, శ్రీలంక పై ఇది 9వ విజయం. 

శిఖర్‌ ధావన్‌ వన్డేల్లో 4000 పరుగులను ఈ మ్యాచ్ తోనే అధిగమించాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (100 - 85 balls 13×4, 2×6), శ్రేయస్‌ అయ్యర్‌ (65 - 63 balls 8×4 1×6) పరుగులతో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Posted On 17th December 2017

Source eenadu