ధోనీ... T20 ల నుండి తప్పుకో - లక్ష్మణ్
ధోనీ... T20 ల నుండి తప్పుకో - లక్ష్మణ్

మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని టీ20లను ఇక కుర్రాళ్లకు వదిలేస్తే మంచిదని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. రెండో టీ20లో ధోని బ్యాటు ఝుళిపించలేకపోయిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్ష్యఛేదనలో కోహ్లి స్ట్రైక్‌రేట్‌ 160కాగా.. ధోనీది 80 మాత్రమే. అంత భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఈ స్ట్రైక్‌రేట్‌ ఏమాత్రం సరిపోదు. టీ20ల్లో ధోని ఇక కుర్రాళ్లకు దారివ్వాలన్నది నా ఉద్దేశం. ఐతే అతడు వన్డే జట్టులో అంతర్భాగం’’ అని రెండో టీ20 అనంతరం లక్ష్మణ్‌ అన్నాడు. టీ20ల్లో భారత్‌.. ధోనీకి ప్రత్యామ్నాయాన్ని చూడాలని మరో మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Posted On 6th November 2017

Source eenadu