BJP తో YSR కాంగ్రెస్ పొత్తు
BJP తో YSR కాంగ్రెస్ పొత్తు

రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. నిన్న మిత్రులుగా ఉన్నవారు, ఈరోజు బద్దశత్రువులుగా… నిన్న శత్రువులుగా ఉన్నవారు ఈరోజు మిత్రులుగా మారిపోతున్నారు. మొన్నటివరకు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న TDP బయటకు రావాలని నిర్ణయం తీసుకోవడం, అనుకున్నదే తడవుగా గురువారం అశోక గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామాలు సమర్పించడం చకచకా జరిగిపోయాయి.

అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. గత కొద్దినెలలుగా BJP తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న YSRCP, BJP తో పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి ఆ పార్టీ MP , సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.

విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ " ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మా మద్దతు ఉంటుంది. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు, మేం కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మీద మాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. మా డిమాండ్‌ను మోదీ ఆమోదిస్తారని నమ్మకంతో ఉన్నా" అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో BJP, YSRకాంగ్రెస్ పొత్తు ఉండొచ్చేమో అనిపిస్తుంది.

Posted On 10th March 2018