మాట ఇచ్చాడు... నిలబెట్టుకుంటున్నాడు
మాట ఇచ్చాడు... నిలబెట్టుకుంటున్నాడు

టెంపర్ ఆడియో రిలీజ్ లో NTR అభిమానులకు ఒక మాట ఇచ్చాడు. ఇక నుండి అభిమానులు మెచ్చే విధంగానే సినిమాలు ఎంపిక చేసుకుంటానని, అభిమానులు కాలర్ ఎగరేసే సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పాడు.

మాట ఇవ్వడమే కాకుండా దాన్ని నిలబెట్టుకున్నాడు. టెంపర్ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఇదే మాట చెప్తారు. అంతకు ముందు కొన్ని సినిమాలు ఒకే లుక్ లో దర్సనమిచ్చిన NTR, టెంపర్ తర్వాత సినిమా సినిమా కు చాలా మార్పు చూపిస్తున్నాడు.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తో తన తర్వాత సినిమా కోసం NTR కష్టపడుతున్న తీరు అభిమానులనే కాకుండా అందర్నీ ఆచర్యపరుస్తుంది. మూడు సంవత్సరాల క్రితం ఆడియో ఫంక్షన్ లో అభిమానులకు ఇచ్చిన మాట కోసం NTR తీసుకుంటున్న శ్రద్ద, కష్టపడుతున్న తీరు నిజంగా అభినందనీయం.

Posted On 14th March 2018