హోదానే అవసరం లేదు… ప్యాకేజి ఇచ్చినా చాలు

మొన్నటి వరకు ప్రత్యేక హోదాపై తన గళం విప్పిన పవన్ కళ్యాణ్ తన మాట మార్చారు. పవన్ BJP కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్న తరుణంలో పవన్ ఇలా మాట్లాడడం అనుమానాలకు తావిస్తోంది.

News18 ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ‘‘మీరు ఏ పేరైనా పెట్టుకోండి.. ఏపీకి నిధులు కావాలి. ప్యాకేజీ ఇచ్చినా చాలు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజల్లో, అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనితో ఉలిక్కిపడ్డ పవన్ కళ్యాణ్ ‘‘తానలా అనలేదని, రిపోర్టర్ తప్పుగా అర్ధం చేసుకున్నారని బుకాయించే ప్రయత్నం చేసారు’’.

కానీ ఆ ఇంటర్వ్యూ వీడియో ABN చేతికి చిక్కడంతో పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయాడు. ఆ వీడియోలో ‘‘మీరు ఏ పేరైనా పెట్టుకోండి.. ఏపీకి నిధులు కావాలి. ప్యాకేజీ ఇచ్చినా చాలు’’ అన్నట్లు స్పష్టంగా ఉంది.

Posted On 20th March 2018