మోడీకి KCR తొత్తులా వ్యవహరిస్తున్నారు - CPI రామకృష్ణ
మోడీకి KCR తొత్తులా వ్యవహరిస్తున్నారు - CPI రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకి KCR సైంధవుడిగా అడ్డుపడుతున్నారని, ప్రధాని మోడీకి KCR తొత్తులా వ్యవహరిస్తున్నారని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన హామీల అమలుకు వెంకయ్య నాయుడు కృషి చేయాలని కోరారు. ఈనెల 27న అంబేద్కర్ విగ్రహాల ఎదుట రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తామని అన్నారు. అదే రోజు రాష్ట్ర ప్రజలందరూ గంటపాటు లైట్లు ఆఫ్ చేసి, చీకటి దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.

అయితే, ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు… ఎందుకంటే

ప్రత్యేక హోదా కోరుతూ అవిశ్వాస తీర్మానానికి TDP నోటీసులు ఇవ్వడం, దానికి దాదాపు 7 పార్టీలు మద్దతివ్వడం అందరికీ తెలిసిందే. అయితే అవిశ్వాసం చర్చకు రాకుండా BJP వ్యూహాలు అమలు చేస్తుంది.

TRS, AIDMK ను పావులుగా వాడుకొని సభలో గందరగోళం సృష్టించి, పదే పదే వాయిదా పడేలా చేస్తుంది. సభ సజావుగా జరగట్లేదు కనుక అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం లేదు. అసలు TRS పార్టీ BJP కి ఎందుకు సహాయం చేస్తుంది...

మోడీ కి వ్యతిరేకం అనే KCR అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు ?

TRS ఎంపీలు అవిశ్వాసానికి అడ్డుపడడం ఎంతవరకు కరెక్ట్ ?

ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న KCR, మరి ఇలా అడ్డుపడడం ఎందుకు ?

మోడీకి ఇంతలా సాయం చేస్తూ... థర్డ్ ఫ్రంట్ అదీ ఇదీ అని హడావిడి చేయడం ఎందుకు

Posted On 24th March 2018