భరత్‌ అనే నేను... హామీ ఇస్తున్నాను

కొరటాల శివ దర్సకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘భరత్‌ అనే నేను’. కాగా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ని చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు.

‘విరచిస్తా నేడే నవశకం..

నినదిస్తా నిత్యం జన హితం..

భరత్‌ అనే నేను హామీ ఇస్తున్నాను’ అంటూ సాగే ఈ పాట అందరిని అలరిస్తుంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 20న ‘భరత్‌’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Posted On 25th March 2018